బాల‌య్య‌పై చిరు 4 కోట్ల ఆధిక్యం

బాల‌య్య‌పై చిరు 4 కోట్ల ఆధిక్యం

సంక్రాంతికి మ‌హా స‌మ‌రానికి రెడీ అవుతున్నారు తెలుగు ప్రేక్ష‌కులు. ఇటు మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా మీద‌.. అటు నంద‌మూరి బాల‌కృష్ణ 100వ సినిమా మీద అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఐతే కంటెంట్ ప‌రంగా ఎక్కువ ఆస‌క్తి రేకెత్తిస్తున్న‌ది మాత్రం 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి' నే అన‌డంలో సందేహం లేదు. ఎందుకంటే ఇది కొత్త క‌థ‌. పైగా చారిత్రక నేప‌థ్యం ఉన్న‌ది. ఐతే ఆస‌క్తి సంగ‌తి ఎలా ఉన్నా క‌మర్షియ‌ల్ లెక్క‌ల్లో మాత్రం 'ఖైదీ నెంబ‌ర్ 150'.. 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి' పై బిగ్ మార్జిన్‌తో పైచేయి సాధిస్తోంది. చిరు సినిమాకు బిజినెస్ దాదాపు రూ.100 కోట్లు జ‌రిగిన‌ట్లు వార్త‌లొస్తుండ‌గా.. బాల‌య్య చిత్రం బిజినెస్ రూ.60 కోట్ల దాకా అయ్యిందంటున్నారు.

శాటిలైట్ హ‌క్కుల విష‌యంలోనూ రెండు సినిమాల మ‌ధ్య అంత‌రం భారీగా క‌నిపిస్తోంది. చిరు సినిమాకు శాటిలైట్ హ‌క్కులు ఏకంగా రూ.13 కోట్లు ప‌లికిన‌ట్లు స‌మాచారం. ఓ ప్ర‌ముఖ ఛానెల్‌తో ఈ మేర‌కు డీల్ పూర్త‌యిందంటున్నారు. మ‌రోవైపు బాల‌య్య సినిమా శాటిలైట్ హ‌క్కులు రూ.9 కోట్లు ప‌లికాయ‌ట‌. ఆ సినిమాను కూడా ఓ పెద్ద ఛానెలే తీసుకుంద‌ట‌. బాల‌య్య సినిమాల్లో ఇది హైయెస్ట్ రేటే అయినా చిరు సినిమాతో పోలిస్తే ఈ ఫిగ‌ర్ చిన్న‌ది. ఇద్ద‌రి సినిమాల మ‌ధ్య అంత‌రం రూ.4 కోట్లుండ‌టం ఆశ్చ‌ర్య‌మే. మ‌రి ఈ సినిమాల్లో ఏవి ఎంత వ‌సూలు చేస్తాయో.. ఏది ఎంత టీఆర్పీ రేటింగ్ తెచ్చుకుంటుందో చూడాలి.

Tags:

Share: Did you enjoy reading this? If so, please share it with your friends

Share with Facebook friends